రాజేంద్రనగర్: బీసీలకుస్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కల్వకుర్తిలో ఎమ్మార్వోకు వినతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేసి,వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం కల్వకుర్తి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.