ఆలమూరు చెరువు వద్ద గంగ పూజ నిర్వహించి గంగమ్మకు చీరను సమర్పించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆలమూరు గ్రామం వద్ద బుధవారం ఆరు గంటల పది నిమిషాల సమయంలో ఆలమూరు గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత చెరువు వద్ద గంగపూజ నిర్వహించి గంగమ్మకు చీరలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఆలమూరు గ్రామస్తులు ఆహ్వానం మేరకు హంద్రీనీవా కాలువతో పొంగిపొర్లుతున్న చెరువు వద్ద గంగపూజ నిర్వహించి గంగమ్మకు చీరను సమర్పించడం జరిగిందని, అదేవిధంగా అన్ని చెరువులకుహంద్రీనీవా కాలువ ద్వారా నీటితో చెరువులు నింపి రైతుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.