ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పురుషులకు ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణ: రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి
Ongole Urban, Prakasam | May 21, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా పురుషులకు 'సెల్ ఫోన్ రిపేర్'లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి 31 రోజులు ఒంగోలులోని రూడ్సెట్లో శిక్షణ ఇస్తామన్నారు. 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు గలవారు అర్హులన్నారు. శిక్షణలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు ఆధార్, రేషన్ కార్డ్తో ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ వద్ద గల రూడ్సెట్కు రావాలన్నారు.