అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఆదివారం మూడు గంటల 50 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత కనగానపల్లి ఆత్మకూరు మండలాలకు చెందిన ఎమ్మార్వోలతో కాలువ భూసేకరణ పనుల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పేరూరు ప్రాజెక్టుకు జీడిపల్లి జలాశయం నుంచి కాలువ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి సేకరించుటకు ఆత్మకూరు కనగానపల్లి మండలానికి సంబంధించిన ఎమ్మార్వోలతో చర్చించడం జరిగిందని త్వరలోనే జీడిపల్లి నుంచి పేరూరు వరకు కాలువ నిర్మాణం ప్రభుత్వం చేపట్టబోతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.