కార్తిక సోమవారం సందర్భంగా శ్రీశైలానికి భారీగా భక్తుల రద్దీ, స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం
కార్తిక సోమవారం సందర్భంగా శ్రీశైలానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది, స్వామి అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు, వేకువజాము నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగాధర మండపం వద్ద కార్తక దీపాలు వెలిగించి కార్తిక నోములను నోచుకున్నారు, భక్తుల రద్దీ కారణంగా స్పర్శ దర్శనం అభిషేకాలు ఆర్థిక సేవలను నిలుపుదల చేసి కేవలం అలంకార దర్శనానికి అనుమతిస్తున్నారు అధికారులు,