ఈ-క్రాప్ నమోదు వేగవంతం చేయాలి..కొయ్యూరులో ఎంపీపీ బడుగు రమేశ్
ఈ-క్రాప్ నమోదు వేగవంతం చేయాలని కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేశ్ గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, ఎంపీఈవోలకు సూచించారు. సోమవారం మధ్యాహ్నం కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి బీ.రాజ్ కుమార్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా, డీఏపీ తదితర ఎరువులను రైతులకు పంపిణీ చేయాలన్నారు. మండలంలో పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఈ-క్రాప్ నమోదు చేయాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు