డోన్: బేతంచెర్ల మండలం లో విషాదం ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
Dhone, Nandyal | Jun 8, 2026 నంద్యాల జిల్లాలో బేతంచెర్ల మండలంలో సోమవారం విషాద ఘటన జరిగింది. బేతంచెర్ల మండలం అంబాపురం గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ కంసలి లింగన్న (43) ప్రమాదవశాత్తు మృతి చెందారు. తన పొలంలో వ్యవసాయ పనులు ముగించుకుని మరో పొలానికి ట్రాక్టర్తో వెళ్తుండగా బోల్తా పడింది. సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకొని ట్రాక్టర్ కింద నుంచి లింగన్నను బయటకు తీశారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు.