బనగానపల్లె: కోవెలకుంట్ల మండలంలో కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకు వంశీకృష్ణ (22)ను తండ్రి వసంతరావు కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. డిగ్రీ పూర్తి చేసిన వంశీకృష్ణ కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిస అయిన తెలుస్తోంది. అతని మానసిక పరిస్థితి కూడా సరిగాలేక తరచూ తల్లిదండ్రులను వేధిస్తూన్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు