ఒంగోలు అర్బన్: ఒంగోలులో పర్యటించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఎంపిక అవుతారని ఊహాగానాలు
Ongole Urban, Prakasam | May 31, 2026
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఒంగోలులో ఘన స్వాగతం లభించింది. అతి త్వరలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఎన్నికవుతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుండడంతో కార్యకర్తలలో జోష్ నెలకొంది. ఆదివారం ఒంగోలు పట్టణంలో పర్యటించిన ఆయనకు కార్యకర్తలు నాయకులు పూల వర్షం కురిపిస్తూ శాలువాతో సన్మానించారు. బాలినేనికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లు పెట్టడం వల్లే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారని బాలినేని అనుకూల వర్గం అంటున్నారు.