కానసాని వారి పల్లెలో టట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం పర్యటన.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలం కానసాని వారి పల్లి రైతు సేవా కేంద్రాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారులు మంగళవారం క్షేత్ర అధ్యయన పరిశోధన కార్యక్రమంలో భాగంగా సందర్శించారు .రైతు సేవ కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న వివిధ సేవా కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని వినుత ,ఎంపీడీవో గంగయ్య గౌడ్ , రైతు సేవ కేంద్రం సిబ్బంది. రైతులు పాల్గొన్నారు.