కొత్తగూడెం: పాల్వంచ రాజ్యలక్ష్మి హీరో షోరూం లో అగ్ని ప్రమాదం సుమారు 20 లక్షల ఆస్తి నష్టం
పాల్వంచలోని అయ్యప్పగుడి సమీపంలో ఉన్న రాజ్యలక్ష్మి మోటార్స్ హీరో షోరూంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, షోరూంలో ఉన్న కొత్త ద్విచక్ర వాహనాలు, విడి భాగాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు షోరూం యాజమాని అంచనా వేశారు.