నంద్యాల అర్బన్: నంద్యాల కలెక్టరేట్ ముందు టీచర్ల ధర్నా
Nandyal Urban, Nandyal | Apr 21, 2026
తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు మంగళవారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ.. పీఆర్సీ అమలు చేయాలని, 30% ఐఆర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 25న విజయవాడలో భారీ స్థాయిలో ధర్నా, ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు.