ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఆలోచన విధానంలో ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి నిదర్శనం అన్నారు. బావి భారత సమాజ నిర్మాణానికి కీలక భాగస్వాములైన ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా ఉండడానికి ఆటల పోటీలు నిర్వహించడం ఒక మంచి నిర్ణయం అన్నారు.