నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోమల గ్రామంలోని ప్రసిద్ధ విష్ణు కంటి క్షేత్రంలో పవిత్ర భాగవత పఠణ శ్రవణ యజ్ఞం సోమవారం ప్రారంభమైంది. క్షేత్ర పీఠాధిపతి రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగనుంది. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ యజ్ఞంలో పదిమంది ఆధ్యాత్మిక వక్తలు భాగవత పఠనం చేస్తున్నారు.