జమ్మికుంట: వికలాంగుల వృద్ధుల పెంచిన పెన్షన్లు అమలు చేయాలనిMRPS జిల్లా కార్యదర్శి అంబాల రాజు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముట్టడి
జమ్మికుంట: ఎమ్మార్పీఎస్ ఆదేశాల మేరకు చేయూత వికలాంగుల వృద్ధుల పెన్షన్లు పెంచాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అంబాల రాజు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం తాసిల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 4000 నుండి 6000 కు వృద్ధుల పెన్షన్ 2000 వేల నుండి 4వేలకు పెంచుతానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికీ పెంచక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన పెన్షన్ అమలు చేయాలని లేనట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.