జనవరి 21 నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించే విధంగా సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఇంటర్ పరీక్షలను విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆదేశించారు.సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖ అధికారులతో డిఆర్ఓ సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణ ప్రక్రియ విజయంతో మొదటకు ఆయా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు .