గుంతకల్లు: గుత్తిలో ధరలు లేక టమాటాలను పెద్దవంకలో పడేసిన రైతులు, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మార్కెట్ లో టమాటా ఉత్పత్తులకు సరైన ధరలు లేకపోవడంతో రైతులు మార్కెట్ కు తెచ్చిన టమోటాలను పెద్ద వంకలో పడేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోమవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుత్తి మండలంలోని పలువురు రైతులు టమాటాలు విక్రించేందుకు గుత్తి మార్కెట్ కు ఇచ్చారు. అయితే అక్కడ కిలో రూ. నుంచి రూ.5 ధర పలకడంతో రవాణా ఖర్చులు కూడా రావని నిరసన తెలుపుతూ టమోటాలను పెద్ద వంకలో పడేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు