జిల్లాలో యూరియాకు కొరతలేదని కలెక్టర్ వెల్లడి, ఒక్కరోజే 440 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామని ప్రకటన
జిల్లాలో యూరియాకు కొరతలేదని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒక్కరోజే జిల్లాలోని 35 రైతు సేవ కేంద్రాలు వ్యవసాయ సొసైటీల ద్వారా 440 మెట్రిక్ టన్నుల యూరియాను దాదాపు 5వేల మంది రైతులకు పంపిణీ చేశామని ఆయన వెల్లడించారు. మరో 220 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు.రైతులు ఆందోళన చందనవసరం లేదని, అందరికీ యూరియా అందుతుందని చెప్పారు.