పెద్ద అంబర్పేట్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్‌పై న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా, ఆరుగురికి తీవ్ర గాయాలు, మరో తొమ్మిది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వేగం ఎక్కువగా ఉండటం, మలుపు వద్ద నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు