ఒంగోలు అర్బన్: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా వైసిపి శ్రేణులు భారీ నిరసన
Ongole Urban, Prakasam | Jun 12, 2026
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో రాష్ట్ర అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఒంగోలు నియోజక వర్గంలో వైసీపీ నేతలు కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ భవనం వద్ద నుండి కలెక్టరేట్ సెంటర్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ర్యాలీగా తరలి వచ్చిన వైసీపీ నేతలు కార్యకర్తలు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వినతులను సమర్పించే నినాదాలు చేస్తూ నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అంటూ కల్లబొల్లి హామీలను ఇచ్చే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పథకాలను అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విప్లమయ్యాడంటూ దుయపడ్డారు