ఖైరతాబాద్: నగరవ్యాప్తంగా 45 సీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
సోమవారం నగరవ్యాప్తంగా 45 స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేశారు. సింథటిక్ కలర్ వాడి తయారుచేసిన స్వీట్లను సీజ్ చేశారు. పదార్థాల తయారీలో కల్తీ నెయ్యి, నూనే వాడినట్లు గుర్తించారు. లేబుల్స్, ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్మకాలు జరుపుతున్న షాపులకు నోటీసులు ఇచ్చారు