సంతనూతలపాడు: ప్రైవేట్ స్కూల్స్ బస్సులను తనిఖీ చేసిన సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబు
సంతనూతలపాడు లో పలు ప్రైవేట్ స్కూల్స్ బస్సులను ఎస్సై అజయ్ బాబు శనివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.... ప్రైవేట్ స్కూల్స్ బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలన్నారు. డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండాలని, ఫైర్ సర్వీస్ యూనిట్లు ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులు సురక్షితంగా బయటపడేలా ఎగ్జిట్ డోర్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ బస్సులను రోడ్లపై తిరగనివ్వమని, స్కూల్స్ యాజమాన్యాలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎస్సై హెచ్చరించారు.