ఆళ్లగడ్డ: అహోబిలం టెండర్ వ్యవహారంపై తనపై చేసిన ఆరోపణలను నిరూపించండి లేకపోతే మీ ఇంటికే వస్తా ఎమ్మెల్యే అఖిల ప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం టెండర్ల వ్యవహారం పై తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు, ఆళ్లగడ్డలో బుధవారం మీడియాతో ఆమె మాట్లాడారు టెండర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతోనే అభ్యంతరం తెలిపామని ఆమె పేర్కొన్నారు, మాజీ సీఈవో పార్థసారధి పై పలు ఆరోపణలు చేశారు, ఈ వ్యవహారంపై వాస్తవాలు బయటపెట్టాలని లేదంటే మీ ఇంటికి వస్తానని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి కి ఓపెన్ చాలెంజ్ విసిరారు