రాప్తాడు: పాపం పేటలో పేదల ఇళ్ల సమస్యల కోసం పోరాటాలు చేస్తాం పాపంపేట పరిరక్షణ సమితి గోపాల్ రెడ్డి రామిరెడ్డి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేటలో సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పాపంపేట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాపంపేట పరిరక్షణ సమితి సభ్యులు గోపాల్ రెడ్డి సిపిఐ నగర కార్యదర్శి రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ పాపంపేటలో 300 ఎకరాల భూమిని 1952 లోని అనేకమంది కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని ఇప్పుడు కొంతమంది ఆ స్థలం మాకే చెందుతుందని కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగిందని సమస్యపై పాపంపేట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని పాపంపేట పరిరక్షణ సమితి గోపాల్ రెడ్డి, రామిరెడ్డి పేర్కొన్నారు..