సంతనూతలపాడు: భారత్ పై అమెరికా విధించిన సుంకాలకు నిరసనగా అమ్మనబ్రోలులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రైతు సంఘం
నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో భారతదేశ ఎగుమత్తులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించడానికి నిరసిస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మను మంగళవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాగులుప్పలపాడు మండల రైతు సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ... భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే డోనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి అమెరికాకు ఎగుమత అయ్యే ఉత్పత్తులపై 50% సుంకాలను విధించారు అన్నారు. ట్రంప్ చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు.