పలమనేరు: గంగవరం: చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి, కన్నీటి పర్యంతమైన కుటుంబీకులు
గంగవరం: మేలుమాయి గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు. కొత్తూరు గ్రామవాసి లేట్ వెంకటప్ప కుమారుడు మోహన్ చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారని తెలిపారు. ఘటనను తెలుసుకున్న గ్రామస్తులు పుట్టగొట్టిన చెరువు వద్దకు వెళ్లి మోహన్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి, ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సిఉంది.