నందికోట్కూరు: షికారి పేటలో ఎక్సైజ్ సిబ్బంది దాడులు 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం 15 లీటర్ల నాటు సారా స్వాధీనం ఇద్దరి అరెస్టు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం ఎక్సైజ్ సిబ్బంది ఆధ్వర్యంలో నంద్యాల స్క్వాడ్ ఎస్సై నందికొట్కూరు ఎస్సై మరియు సిబ్బందితో షికారి కాలనీ నందు దాడులు నిర్వహించి 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 15 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని ఇద్దరినీ షికారి హైమ షికారి లక్ష్మీలను అరెస్టు చేశారు, ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై రమేష్, ఎస్సై జఫ్రుల్లా, హెడ్ కానిస్టేబుల్ పద్మనాభం శంకర్ నాయక్, కానిస్టేబుల్ సుధీర్ కుమార్ శివన్న సంధ్యారాణి తదితర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు