బనగానపల్లె: మే 5న కొలిమిగుండ్లలో స్లో బైక్ రేస్ పోటీలు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మే 5న స్లో బైక్ రేస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్రీడ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయ రవికుమార్ గురువారం వెల్లడించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన రాయలసీమ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ప్రథమ బహుమతి రూ.7000, రూ.4000 అందించనున్నట్లు వెల్లడించారు. యువకులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.