జగదూర్తి గ్రామంలో నిప్పు అంటుకొని గడ్డివాము దగ్ధం, సుమారు రూ. 70వేలు నష్టం
Dhone, Nandyal | May 2, 2025 డోన్ మండలం జగదుర్తి గ్రామంలో శుక్రవారం సుంకన్న అనే రైతుకు చెందిన గడ్డివాము ప్రమాదవశాత్తు ని పట్టుకుని దగ్ధమైంది. సమాచారం అందుకున్న డోన్ అగ్నిమాపక కేంద్ర అధికారి రంగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకొచ్చారు. అయితే అప్పటికే గడ్డివాము పూర్తిగా దగ్ధమైందని సుమారు రూ. 70వేల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతు సుంకన్న కోరారు.