ఒంగోలు అర్బన్: మాజీ మంత్రి బాలినేని ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవి పాతిక లక్షలకు అమ్మకానికి పెట్టాడు: జనసేన నేత జడ బాల నాగేంద్ర
Ongole Urban, Prakasam | May 19, 2026
జనసేన ఆరు జిల్లాల డీలిమిటేషన్ కమిటీ ప్రధాన సభ్యులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన జిల్లా అధ్యక్ష పదవులు అమ్మకానికి పెట్టాడంటూ బాలినేని అనుచరుడు జడ బాల నాగేంద్ర మంగళవారం ఒంగోలు ఎంసీఏ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశాడు ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవి పాతిక లక్షలకు నెల్లూరు తిరుపతి అధ్యక్ష పదవులు 50 లక్షలకు బేరం పెట్టాడని విమర్శించాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాలం నుండి సీట్ల అమ్మకం అతనికి కొత్తవి కాదన్నాడు స్థానిక ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా అసత్యాలతో కూడిన లెటర్ ను రాయించడంలో బాలినేని పాత్ర ఉందని ఆ సమయంలో తాము తప్పని చెప్పిన వినలేదని అన్నారు