అన్నమయ్య జిల్లా. మదనపల్లె నియోజవర్గం. రామసముద్రం మండలం పెద్ద కురప్పపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి అమానుష ఘటన చోటుచేసుకుంది. అన్న హరి తమ్ముడు అశోక్ కుమార్ ,లమధ్య మాట మాట పెరిగి గొడవపడ్డారు. అన్న హరి, తమ్ముడు అశోక్ కుమార్ పొట్టపై కత్తితో దాడి చేయగా పొట్టలో నుంచి పేగులు బయటకు రావడంతో వెంటనే గమనించినను కుటుంబ సభ్యులు అశోక్ కుమార్ ను రామసముద్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహించి అశోక్ కుమార్ పరిస్థితి విషమించడంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.