ఒంగోలులో కార్డెన్ చర్చ్ 12 బైకులు 6 ఆటోలు స్వాధీనం
Ongole Urban, Prakasam | Apr 19, 2026
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి శ్రీనివాసరావు అధ్వర్యంలో ఒంగోలు టు టౌన్ సీఐ యం.శ్రీనివాసరావు, ఒంగోలు సబ్ డివిజన్ 8 మంది ఎస్సైలు , 42 మంది పోలీస్ సిబ్బంది ఒంగోలు టౌన్ లోని బాలాజీ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల ఇళ్లలో సోదా చేశారు