ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి..
ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా. బీవి జయ నాగేశ్వర రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని చేరుకుని ఘటనను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మిగనూరు శాసన సభ్యులు డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి , అక్కడి పరిస్థితులను స్థానికులతో, అధికారులతో తెలుసుకున్నారు.రోడ్డు ప్రమాదం పై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించిన ఎమ్మెల్యే డా. బీవి జయ నాగేశ్వర రెడ్డి , ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రెండు కార్లు ఢీకొన్న ఈ భయానక ప్రమాదంలో 5గురు మృతి విచారమన్నారు