ఢిల్లీ, గోవా, పాండిచ్చేరి నుంచి అక్రమంగా తెచ్చిన 192 మద్యం బాటిళ్లు పహాడీషరీఫ్ వద్ద తనిఖీల్లో పట్టుబడింది. విమానాల్లో మద్యం తీసుకువచ్చి తెలంగాణలో విక్రయానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో జరిగిన ఈ ఆపరేషన్లో.. నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్న 20 మందికి నోటీసులు జారీ చేశారు. సుమారు రూ.5.76 లక్షల విలువైన ఈ బాటిళ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు.