కోడుమూరు: కోడుమూరు నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సభకు భారీగా తరలిన ప్రజానీకం
సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ సభలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాకు విచ్చేశారు. ముందుగా ప్రధాని శ్రీశైల భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కర్నూలు సమీపంలో సభలో పాల్గొంటారు. దేశ ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగుల దస్తగిరి ఆధ్వర్యంలో కోడుమూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు బస్సుల్లో భారీగా తరలి వెళ్లారు.