అనంతపురం జిల్లా నీలారెడ్డిపల్లి లో వృద్ధుడు అనుమానాస్పద మృతి
Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుకరా సముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామంలో చెన్నప్ప అనే 81 సంవత్సరాల వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి సోమవారం మధ్యాహ్నం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.