రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎరువుల కొరత లేదు,కావాలనే దుష్ప్రచారం చేయడం సరికాదు: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటల సాగుకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం రాత్రి 10:59 నిమిషాలకు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రుద్రంగి మండలంలో ఎరువుల కొరత ఉందని కావాలని ఒక ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో దుష్ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. జిల్లాలో సాగుకు అనుగుణంగా అందుబాటులో యూరియా నిలువలు ఉంచామని కలెక్టర్ వెల్లడించారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండలంలో ఎరువుల కొరత లేదని, రైతులు సంయమనం పాటించాలని కోరారు.