ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 58 అర్జీల స్వీకరణ, సంబంధిత పోలీసు అధికారులకు బదిలీ, తక్షణ చర్యలకు ఆదేశం
Ongole Urban, Prakasam | Sep 15, 2025
ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో సీనియర్ పోలీసు అధికారులు ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు.వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. తమకు అందిన 58 అర్జీలను వారు సంబంధిత పోలీసు అధికారులకు ఎండార్స్ చేశారు.నిర్ణీత కాల వ్యవధిలో చట్ట పరిధిలో ఈ అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు