గుంటూరు: నగరంలో మూడు కలరా కేసులు: జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
Guntur, Guntur | Sep 22, 2025 ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంచినీటిలో మురుగునీరు సరఫరా కావడంతో నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, భయపడవలసిన అవసరం లేదన్నారు. నగరవాసులు కొద్ది రోజులపాటు నీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచించారు. నగరంలో ఇప్పటికీ మూడు కలరా కేసులను గుర్తించడం జరిగిందన్నారు.