పుంగనూరు: అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని తొలగించిన మున్సిపల్ అధికారులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక సంఘం పరిధిలోని మదనపల్లె రోడ్డు 14వ అవార్డులో పురపాలక సంఘం అనుమతులకు మించి అదనపు అంతస్తు నిర్మిస్తున్నారని మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేశారు. మునిసిపల్ అధికారుల నోటీసును బేఖాతరూ చేస్తూ అదనపు అంతస్తు నిర్మాణం చేపడుతుండడంతో మంగళవారం టౌన్ ప్లానింగ్ సిబ్బంది వెళ్లి అదనంగా నిర్మిస్తున్న అంతస్తును మునిసిపల్ చట్టం1965 ప్రకారం తొలగించినట్లు మునిసిపల్ కమిషనర్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో భవన నిర్మాణాల కోసం మునిసిపల్ అనుమతుల పొంది భవన నిర్మాణాలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కోరారు.