ఒంగోలు అర్బన్: యోగ పై అవగాహన కల్పించేందుకే 15 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం; కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 10, 2026
జిల్లావ్యాప్తంగా ప్రజలకు యోగ పై అవగాహన కల్పించేందుకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు అన్నారు. బుధవారం సింగరాయకొండలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రజలకు యోగ పై అవగాహన కల్పించేందుకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. యోగా చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు.