నంద్యాల అర్బన్: పొగాకు ఉత్పత్తుల ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు: నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ
Nandyal Urban, Nandyal | May 30, 2026
పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కార్యాలయం నుంచి సాయిబాబా నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వెంకటరమణ మాట్లాడుతూ.. పొగాకు ద్వారా గొంతు, అన్న వాహిక, మూత్రాశయం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. వివిధ రూపాల్లో పొగాకు తీసుకోవడం మంచిది కాదని చూపించారు