పెడన: బంటుమిల్లిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం, కేసు నమోదు
బంటుమిల్లి మార్కెట్ యార్డ్ ప్రాంతంలో నివశిస్తున్న మానసిక వికలాంగురాలిపై కొనాల వెంకటేశ్వరరావు (50) అనే వ్యక్తి అత్యాచారంకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెడన సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం గత నెల 26వ తేదీన ఒంటరిగా ఉంటున్న మానసిక వికలాంగురాలిపై వెంకటేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె బంధువులు ఫిర్యాదు చేశారన్నారు.