పిట్లం: పిట్లం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వెంకట్రావ్
పిట్లం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రావ్... ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన ఎస్సై రాజును ఏ ఆర్ కు బదిలీ చేయడంతో పిట్లం నూతన ఎస్సై గా టీ వెంకట్రావ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం 7 గంటలకు ఆయన మాట్లాడుతూ రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అనవసర ప్రయాణాలు చేయ వద్దని సూచించారు. పాడుబడ్డ ఇల్లలో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు. కరెంట్ పోల్ లను ముట్టుకోవద్దని ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే సంబధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.