ఆళ్లగడ్డ: ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో ఈ ప్రహల్లాద వరదస్వామికి గ్రామోత్సవం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు, స్వాతి నక్షత్రం సందర్భంగా ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహల్లాద వరద స్వామి శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు, అనంతరం పల్లకిలో ఆసీనులను చేసి ఆలయ మాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు