ధర్మవరం నియోజకవర్గ బూత్ ఏజెంట్లతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక సమావేశం.
ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల్లోని బూత్ లెవెల్ ఏజెంట్లతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయం కాకపోయినా బిఎల్ఏ లతో సమావేశం నిర్వహించడం ఎంతైనా అవసరం అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్లాలంటే బి ఎల్ఏ ల ద్వారానే ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.