బనగానపల్లె: కొలిమిగుండ్ల లో జనసేన నాయకులు నాగేంద్ర తల్లి లక్ష్మీదేవి విద్యుత్ షాక్ తో మృతి, నివాళులర్పించిన జనసేన నేతలు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై కొలిమిగుండ్ల జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర తల్లి లక్ష్మీదేవి మృతి చెందారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సురేష్ అంకిరెడ్డి పల్లె గ్రామానికి చేరుకుని లక్ష్మీదేవి పార్తివదేహానికి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధికారులతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాగేంద్ర కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు