ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస రెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ శ్రీనివాసరెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు, ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహకారంతో కళాశాల అభివృద్ధికి, అవసరమైన స్థల సేకరణకు, నూతన భవనాల నిర్మాణ సాధనకు కృషి చేస్తారని తెలిపారు, అలాగే డిగ్రీ కళాశాల లో అడ్మిషన్లు పెంచడానికి మన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు, బాధితులు చేపట్టిన ప్రిన్సిపాల్ కు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు