కొండమల్లేపల్లి: మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ టీచర్ కొట్టాడని మనస్తాపంతో విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు కొట్టాడని శుక్రవారం సాయంత్రం విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రికి తరలించారు. కాగా వ్యాయామ ఉపాధ్యాయుడు కొట్టడం వల్లనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.