ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు:ఆదోని జిల్లా కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలో 700 మందితో ర్యాలీగా వెళ్లి పాల్గొన్న మాజీ ఎంపీ బుట్టా రేణుక
ఆదోనిని జిల్లాగా ప్రకటించకపోతే ఊరుకునేది లేదని మాజీ ఎంపీ బుట్టా రేణుక కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 16వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు భారీ ఎత్తున కార్యకర్తలతో వచ్చి మద్దతు తెలిపారు. ఐదు నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోతే పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు నుంచి 700 మందితో ర్యాలీగా వెళ్లి ఆదోని జిల్లా కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.